రామ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన 'బేబి' హీరోయిన్?
- 'బేబి' సినిమాతో హిట్ అందుకున్న వైష్ణవి
- యూత్ లో పెరిగిపోయిన ఫాలోయింగ్
- క్యూ కడుతున్న ఆఫర్లు
- పూరి సినిమాలో ఛాన్స్ దొరికిందనే టాక్
ఈ నేపథ్యంలో ఆమెను తమ సినిమాలోకి తీసుకోవడానికి యంగ్ హీరోలంతా గట్టిగానే ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. యంగ్ హీరోలతో ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్న మేకర్స్, ముందుగా ఆమె పేరునే పరిశీలిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె పూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. రామ్ హీరోగా పూరి 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందట. ఒక హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేయడం జరిగిందని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.