Hyderabad: హిజ్జుత్ తహ్రీర్ కేసులో మరో హైదరాబాద్ వాసి అరెస్ట్

Hizb Ut Thahrir terrorist arrested in Hyderabad by NIA
  • షరియా చట్టం అమలుకు హిజ్జుత్ తహ్రీర్ కుట్ర
  • 17కు చేరిన అరెస్ట్‌ల సంఖ్య
  • ఇంట్లో సోదాలు.. కీలక పత్రాల స్వాధీనం
హిజ్జుత్ తహ్రీర్ కేసులో కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ మంగళవారం మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న సల్మాన్‌ను అరెస్ట్ చేసింది. భారత్‌లో షరియా చట్టం అమలుకు హిజ్జుత్ తహ్రీర్ కుట్ర చేసింది. భోపాల్, హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో సలీం నేతృత్వంలో హిజ్జుత్ తహ్రీర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మే 24న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసింది. హిజ్జుత్ తహ్రీర్‌లో సల్మాన్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లుగా గుర్తించారు. అతడిని రాజేంద్రనగర్‌లో అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, అతనికి చెందిన రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్‌తో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
Hyderabad
nia

More Telugu News