Pawan Kalyan: చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికీ తెలిసిందే: మంత్రి కొట్టు

Minister Kottu talks about Chandrababu conspiracy about Chiranjeevi family
  • పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్యాకేజీ స్టార్‌లా మారిపోయాడని విమర్శ
  • కాపులను తొక్కేయడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ  లేదని ఆరోపణ
  • చంద్రబాబు విషకౌగిలి నుండి పవన్ బయటపడాలని సూచన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ అని, కానీ ఆయన రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్‌గా మారిపోయారని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే ఆయన అదే చెబుతున్నారని, అలా చెప్పడమే కాదు.. దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ స్టార్‌లా మారిన పవన్‌ను చూస్తుంటే జాలేస్తోందన్నారు. కాపులను తొక్కేయడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. చంద్రబాబు విషకౌగిలి నుండి పవన్ ఇప్పటికైనా బయటపడాలన్నారు. చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికీ తెలిసిందేనని, వాటిని పవన్ తెలుసుకోవాలన్నారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు మంత్రి కొట్టు బెజవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, రథాన్ని లాగి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయతీగా వస్తోందన్నారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నారు.
Pawan Kalyan
kottu satyanarayana
Chiranjeevi
Chandrababu

More Telugu News