ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా.. విపక్షాల ఆందోళన
- బిల్లు చట్టరూపం దాలిస్తే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర
- అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్రానిదే పెత్తనం
- బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్
ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కేజ్రీవాల్ కు అండగా నిలిచాయి. బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల వరకు సభను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.