Extra: శ్రీలీల డేంజర్ పిల్లనే .. 'ఎక్స్ ట్రా' అప్ డేట్!

  • నితిన్ హీరోగా రూపొందుతున్న 'ఎక్స్ ట్రా'
  • కథానాయికగా అలరించనున్న శ్రీలీల
  • 'డేంజర్ పిల్లా' పూర్తి సాంగ్ ఆగస్టు 2న రిలీజ్
  • డిసెంబర్ 23వ తేదీన సినిమా విడుదల    
Extra movie song promo released

నితిన్ - శ్రీలీల జంటగా 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్' సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. వక్కంతం వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను, అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

ఈ కథలో నితిన్ సినిమాల్లో నటించే ఒక జూనియర్ ఆర్టిస్టుగా కనిపించనున్నాడు. ఆయన జోడీగా శ్రీలీల అలరించనుంది. ఈ ఇద్దరిపై చిత్రీకరించిన ఒక పాటకి సంబంధించిన 'ప్రోమో'ను కొంత సేపటి క్రితం రిలీజ్ చేశారు. 'డేంజర్ పిల్లా పిల్లా .. ఏంజిల్లా నువ్వు ..' అంటూ ఈ పాట సాగుతోంది. హారీస్ జైరాజ్ కంపోజ్ చేసిన పాట ఇది.  
 
విదేశాల్లో సాగర తీరంలో .. మంచు కొండల నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. ఆగస్టు 2వ తేదీన పూర్తి పాటను వదలనున్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News