P Narayana: నా భార్య మానసిక ఆరోగ్యం బాగాలేదు... ఆ వీడియోలను ఎవరూ పట్టించుకోవద్దు: నారాయణ సోదరుడి విజ్ఞప్తి

Ex Minister Narayana Brother subrahmanyam Shocking Comments on his wife
  • తన భార్య మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నారన్న సుబ్రహ్మణ్యం
  • ఆమెకు క్యాన్సర్‌‌ ఉన్నట్లు గత మే నెలలో డాక్టర్లు చెప్పారని వెల్లడి
  • కీమోథెరపీ కొనసాగుతోందని, ఆమె వ్యాఖ్యలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి
మాజీ మంత్రి నారాయణ తనను తీవ్రంగా వేధించారంటూ ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దుమారం రేపిన ఈ వ్యవహారంపై నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్పందించారు. తన భార్య ఆరోగ్యం బాగాలేదని, ఆమె వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కోరారు.

తన భార్య కొన్ని రోజులుగా మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నారని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆమె కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారని చెప్పారు. అవి తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. పలువురు సైకియాట్రిస్టులకు చూపించామని, అయినా ఆమె పరిస్థితి మెరుగు కాలేదని అన్నారు. 

కృష్ణప్రియకు క్యాన్సర్‌‌ ఉన్నట్లు గత మే నెలలో డాక్టర్లు చెప్పారని సుబ్రహ్మణ్యం వివరించారు. యశోద ఆసుపత్రిలో తన భార్యకు సర్జరీ చేసినట్లు చెప్పారు. 8 సార్లు కీమోథెరపీ చేయించాలని చెప్పారని, ఇప్పటికి రెండు సార్లు చేయించామని తెలిపారు.

తన భార్యకు ఇంకా చికిత్స కొనసాగుతోందని ఆయన చెప్పారు. ట్రీట్‌మెంట్ ఇప్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే క్యాన్సర్‌‌కు చికిత్స కారణంగా సైకియాట్రిస్టు మందులను నిలిపివేశారని వివరించారు. మానవతా దృక్పథంతో ఆ వీడియోలను ఎవరూ పట్టించుకోవద్దని సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.

P Narayana
subrahmanyam
krishnapriya ponguru
Nellore

More Telugu News