MS Dhoni: ధోనీ నిద్రపోతుండగా సీక్రెట్‌గా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్!

invasion of privacy fans divided on viral video of ms dhoni being filmed by flight attendant
  • తన భార్య సాక్షితో కలిసి ఇటీవల విమానంలో ప్రయాణించిన ధోనీ
  • కునుకుతీయడంతో చాటుగా ఫొటో, వీడియో తీసిన ఎయిర్‌‌హోస్టెస్
  • సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సదరు మహిళ
  • ధోనీ ప్రైవసీకి భంగం కలిగించడమేనంటూ ఫ్యాన్స్ మండిపాటు
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు అతడి సొంతం. అతడు కనినిస్తే చాలు... ఫొటోలు, సెల్ఫీల కోసం ప్రయత్నిస్తుంటారు ఫ్యాన్స్. తమ అభిమాన ఆటగాడితో ఫొటో దిగేందుకు కొందరు పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు. ఈ మేరకు జరిగిన తాజా ఘటనే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది.

తన భార్య సాక్షితో కలిసి ఇటీవల ధోనీ ఓ విమానంలో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో కునుకుతీశాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్‌‌ హోస్టెస్‌ ఒకరు అత్యుత్సాహంతో... ధోనీ నిద్రపోతున్న వీడియోను సీక్రెట్‌గా రికార్డు చేసింది. పైగా వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోనీ ఇక్కడే ఉన్నారు చూడండంటూ రాసుకొచ్చింది. ఆ వీడియోలో ధోనీ నిద్రపోతుండగా... పక్కనే సాక్షి కూర్చున్నారు. ముందు వైపున సిబ్బంది ఉండే క్యాబిన్ వద్ద ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ నిలుచుని ఉంది.

ఈ ఘటనపై నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు కొందరు సపోర్టు చేస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ధోనీ ప్రైవసీకి భంగం కలిగించడమేనని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  అభిమాన క్రికెటర్‌‌తో ఫొటో దిగాలనే ప్రయత్నం మంచిదే కానీ, అవతలి వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని కామెంట్లు చేస్తున్నారు. 
MS Dhoni
flight attendant
air hostess
dhoni filmed by air hostess
viral video

More Telugu News