Nitish Kumar: నితీశ్ కుమార్ ఏ క్షణంలోనైనా ఎన్డీయేలో చేరుతారు: రాందాస్ అథవాలే

Nitish Kumar will join NDA at any time says Ramdas Athawale
  • నితీశ్ కుమార్ గతంలో ఎన్డీయేలో ఉన్నారన్న అథవాలే
  • బీహార్ లో ఎన్నో మంచి పనులు చేశారని ప్రశంస
  • ఇండియా కూటమి సమావేశానికి వెళ్లొద్దని నితీశ్ కు సూచన

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలోనైనా ఎన్డీయేలో నితీశ్ కుమార్ చేరుతారని ఆయన అన్నారు. నితీశ్ కుమార్ తమ వాడేనని చెప్పారు. గతంలో నితీశ్ తమతోనే ఉన్నారని గుర్తు చేశారు. బీహార్ లో నితీశ్ ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారని కితాబిచ్చారు. 

చాలా కాలం క్రితం తాను బీహార్ కు వచ్చినప్పుడు రోడ్లు అధ్వానంగా ఉండేవని... ఇప్పుడు నితీశ్ పాలనలో చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. అంతేకాదు... ముంబైలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి వెళ్లవద్దని నితీశ్ కు సూచించారు. మరోవైపు విపక్షాల కూటమి కోసం తొలి నుంచి కూడా విస్తృతంగా కృషి చేసింది నితీశ్ కుమార్ అనే విషయం గమనార్హం. బీహార్ రాజధాని పాట్నాలో ఆయన విపక్ష నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.

  • Loading...

More Telugu News