Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని టచ్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి హాట్ ట్వీట్

Ambati Rambabu tweet against Pawan Kalyan
  • గెలిచినోడి డాన్స్ సంక్రాంతి అంటూ అంబటి ట్వీట్
  • గతంలో సంక్రాంతి రోజున డాన్స్ చేసిన అంబటి
  • ఆ డాన్స్ ను టచ్ చేసేలా 'బ్రో' చిత్రంలో సన్నివేశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు. పవన్ తాజా చిత్రం 'బ్రో'లో అంబటిని టచ్ చేసేలా ఓ సన్నివేశం ఉంది. గతంలో సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇలాంటి సన్నివేశమే ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయని విధంగా ఈ చిత్రంలో ఉంది. అంబటి వేసిన విధంగానే నటుడు పృథ్వీతో డ్యాన్స్ చేయించారు. అంతేకాదు ఆరోజున అంబటి వేసుకున్న డ్రెస్ నే పృథ్వీకి ధరింపజేశారు. ఈ సందర్భంగా పవన్ కొట్టే డైలాగ్ కూడా అంబటికి సూటిగా తగిలేలా ఉంది. శ్యాంబాబు.. వస్తున్న టెంపో ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అని పవన్ ప్రశ్నిస్తారు. ఈ సీన్ నేపథ్యంలోనే అంబటి ట్వీట్ చేశారని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News