తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

12 Hours to Tirumala Srivari Sarva Darshan
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
  • 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,932
  • హుండీ ద్వారా స్వామివారి ఆదాయం రూ.4.13 కోట్లు
వారాంతం కావడంతో తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. 

కాగా, నిన్న వెంకటేశ్వరస్వామిని 63,932 మంది దర్శించుకున్నారు. 25,862 మంది తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. గురువారం ఒక్క రోజే తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం లభించింది. 

రేపు, ఎల్లుండి సెలవులు కావడం, వర్షాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తారని భావిస్తున్నారు.
Go Back to Shorts
Tirumala
Lord Venkateswara
Devotees
TTD

More Telugu News