Roja: పవన్ వల్ల ఎంత మంది మహిళలు కనిపించకుండా పోయారో లెక్కించాలి: రోజా

Roja fires on Pawan
  • మహిళల మిస్సింగ్ పై ఏ సంస్థ సమాచారమిచ్చిందో పవన్ చెప్పాలని రోజా డిమాండ్
  • అసలైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని విమర్శ
  • రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించే హక్కు కూడా లేదని వ్యాఖ్య
ఏపీలో జరుగుతున్న మహిళల అక్రమ రవాణా వెనుక కొంత మంది వాలంటీర్ల హస్తం ఉందని జనసేన అధినేత ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో 27 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీ మంత్రి రోజా మాట్లాడుతూ పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వపన్ కల్యాణ్ వల్ల ఎంత మంది మహిళలు కనిపించకుండా పోయారో లెక్క తేలాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఏపీలో మహిళల మిస్సింగ్ పై పవన్ కు ఏ నిఘా సంస్థ సమాచారమిచ్చిందో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా రోజా విమర్శలు గుప్పించారు. అసలైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాయలసీమకు ఆయన చేసిందేమీ లేదని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదని అన్నారు. హెరిటేజ్ షాపుల్లో గంజాయి, నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతాయని ఆరోపించారు.
Roja
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News