brazil: తన ఫోన్ దొంగిలించిన వ్యక్తితో ప్రేమలో పడిన అమ్మాయి.. రెండేళ్లుగా డేటింగ్

Brazilian Woman Falls In Love With Man Who Stole Her Phone
  • బ్రెజిల్‌లో జరిగిన విచిత్ర ప్రేమకథ.. సోషల్ మీడియాలో వైరల్
  • ఫోన్ లో ఆమె ఫోటోను చూడగానే మనసు మారినట్లు వెల్లడించిన దొంగ
  • మొదట ఫోన్ కొట్టేసి.. ఆ తర్వాత మనసు దోచేశానన్న దొంగ

బ్రెజిల్‌లోని ఓ మహిళ తన సెల్ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విచిత్ర ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరు తమ పరిచయం, ప్రేమను వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేయగా, దీనిని వేలాది మంది చూశారు. దొంగతో ప్రేమలో పడిన ఆ యువతి పేరు ఇమాన్యులా. 

'నేను అతను (దొంగ) నివసించే వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. దురదృష్టవశాత్తు అతను నా ఫోన్ లాక్కుపోయాడు' అని ఆమె తెలిపింది. మరోవైపు, ఫోన్ లో ఆమె ఫోటో చూడగానే తన మనసు మారిందని సదరు దొంగ తన ప్రేమకథను చెప్పాడు. తనకు జీవితంలో ఏ అమ్మాయి తోడు లేదని, తాను క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పాడు. అందుకే ఫోన్లో ఆమె ఫోటో చూడగానే మనసు మారిందని, అమ్మాయి ఫోన్ దొంగిలించినందుకు బాధపడ్డానని చెప్పాడు.

ఆ వీడియోలో ఇంటర్వ్యూ చేస్తోన్న వ్యక్తి.. 'మొదట ఆమె ఫోన్‌ను.. ఆ తర్వాత ఆమె మనసును దొంగిలించావ్..' అని సరదాగా కామెంట్ చేయగా.. 'అవును' అని దొంగ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరు రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరి ప్రేమ కథపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వింత ప్రేమ కథలు బ్రెజిల్ లోనే పుడతాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News