Bro Movie: 'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్.. వేడుకకు వచ్చే వారి కోసం కీలక ప్రకటన

BRO movie pre release event to start little late
  • ప్రీరిలీజ్ ఈవెంట్ ఆలస్యంగా ప్రారంభమవుతుందన్న 'బ్రో' చిత్ర యూనిట్
  • వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు నిర్ణయం
  • ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'బ్రో'

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా ఈ నెల 28న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగబోతోంది. ఈ వేడుకకు పవన్ కల్యణ్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. రామ్ చరణ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వేడుకకు వచ్చే అభిమానులను ఉద్దేశించి చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. 

హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పోలీస్ శాఖ వారి సూచనల మేరకు ప్రీరిలీజ్ వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ వేడుక రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News