Team India: టీమిండియాతో రెండో టెస్టు... విండీస్ కు శుభారంభం అందించిన ఓపెనర్లు

West Indies openers gives good start against Team India
  • ట్రినిడాడ్ లో భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులకు ఆలౌట్
  • నేడు ఆటకు మూడో రోజు
  • లంచ్ వేళకు 2 వికెట్లకు 144 పరుగులు చేసిన విండీస్
  • రాణించిన కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్
టీమిండియాతో తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యాలతో ఓటమి చవిచూసిన ఆతిథ్య వెస్టిండీస్... రెండో టెస్టులో కాస్త నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ కాగా... తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలో దిగిన విండీస్ మూడో రోజు ఆటలో లంచ్ వేళకు 2 వికెట్లకు 144 పరుగులు చేసింది. 

కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ 67 పరుగులతోనూ, జెర్మైన్ బ్లాక్ వుడ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్ వైట్, తేజ్ నారాయణ్ చందర్ పాల్ తొలి వికెట్ కు 71 పరుగులు జోడించి శుభారంభం అందించారు. తేజ్ నారాయణ్ చందర్ పాల్ 33, కిర్క్ మెకెంజీ 32 పరుగులు చేశారు. జడేజా 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు విండీస్ ఇంకా 294 పరుగులు వెనుకబడి ఉంది. 

అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ అర్ధసెంచరీ సాధించాడు. అశ్విన్ 78 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేశాడు.
Team India
West Indies
2nd Test
Trinidad

More Telugu News