Anti rape Law: అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు: హైకోర్టు

omen Misusing Anti Rape Law As Weapon Against Partners says High Court
  • పెళ్లి పేరిట తనను మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు
  • కేసు కొట్టేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు
  • పరస్పర అంగీకారంతో దగ్గరై ఆ తరువాత పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం కాదని వ్యాఖ్య
  • భాగస్వాములతో భేదాభిప్రాయలు వచ్చినప్పుడు ఈ చట్టాన్ని ఆయుధంగా వాడుతున్నారని కామెంట్

అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు దుర్వినియోగ పరుస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వాములతో భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై అతడి మాజీ ప్రేయసి దాఖలు చేసిన అత్యాచారం కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి శరద్ కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు వేశారు. 2005 నుంచి వారు రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి జాబ్ వచ్చినా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఆ తరువాత అతడు మరో మహిళను వివాహం చేసుకోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. అయితే, అతడికి పెళ్లయ్యాక కూడా వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో జూన్ 30న ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, మహిళ దాఖలు చేసిన అత్యాచార కేసును కోర్టు కొట్టేసింది. 

‘‘అతడికి పెళ్లయిన తరువాత కూడా పిటిషనర్ తమ బంధాన్ని కొనసాగించారు. అంటే..ఆమె అతడితో బంధానికి అంగీకరించినట్టే’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అతడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది తమ బంధం తొలినాళ్లలోనే నిగ్గుతేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరయ్యాక పెళ్లికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.
Anti rape Law
High Court
Uttarakhand

More Telugu News