Celina Jaitly: ఈ అందాలనటికి రెండుసార్లూ కవలలే పుట్టారు....కారణం ఇదే!

Celina Jaitly talks about her genetic condition as she gave birth twins for two times
  • మంచు విష్ణు హీరోగా సూర్యం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సెలీనా
  • 2011లో ఓ విదేశీయుడ్ని పెళ్లాడిన సెలీనా జైట్లీ
  • 2012లో తొలిసారి కవలలకు జననం
  • 2017లోనూ సెలీనాకు కవలలే
  • వారిలో ఒకరి మృతి
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సూర్యం చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సెలీనా జైట్లీ హీరోయిన్ గా నటించింది. ఆమె అనేక బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. సెలీనా జైట్లీ 2011లో పీటర్ హాగ్ అనే విదేశీయుడ్ని పెళ్లాడి దుబాయ్ లో సెటిలైపోయింది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సెలీనా రెండుసార్లు గర్భవతి కాగా, రెండు పర్యాయాలూ కవలలకే జన్మనిచ్చింది. 2012లో తొలిసారిగా ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సెలీనా... 2017లో మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. వీరిలో ఒకరు హృదయ సంబంధ సమస్య వల్ల చనిపోయినట్టు తెలుస్తోంది. 

కాగా, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే సెలీనా జైట్లీ ఇటీవల అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. రెండుసార్లూ ఆమెకు కవలలే పుట్టడం పట్ల ఓ అభిమాని ప్రశ్నించారు. అంతేకాదు, మీరు కృత్రిమ పద్ధతుల్లో ఇలా ఈ కవలలను కన్నారా? అని కూడా ఆ అభిమాని అడిగారు. అందుకు సెలీనా బదులిచ్చింది. 

వరుసగా కవలల జననానికి తన జన్యు పరిస్థితే కారణమని వెల్లడించింది. గర్భధారణ సమయంలో ఒకటికి మించి అండాలు విడుదలవడం వల్లే ఇలా జరుగుతుందని, ఇది చాలా అరుదైన జన్యు స్థితి అని పేర్కొంది. ఈ తరహా జన్యువులు వంశపారం పర్యంగా సంక్రమిస్తాయని వివరించింది. తనలాంటి వారు కొందరున్నా చాలు.... భవిష్యత్తరాల్లో కవలల సంఖ్య పెరిగిపోతుందని సెలీనా జైట్లీ చమత్కరించింది.
Celina Jaitly
Twins
Genetic Condition
Actress
Bollywood

More Telugu News