Baby Movie: 'బేబి' సినిమాలో ఈ ముగ్గురు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..!

Anand Devarakonda Vaishnavi remuneration in Baby movie
  • బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'బేబి'
  • రూ. 10 కోట్లతో నిర్మితమై... రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం
  • ఆనంద్ రూ. 80 లక్షలు, వైష్ణవి రూ. 30 లక్షలు తీసుకున్నట్టు సమాచారం

ఆనంద్ దేవరకొండ, అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి జంటగా తెరకెక్కిన 'బేబి' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 'హృదయకాలేయం', 'కొబ్బరిమట్ట' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యువతకు, లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుండటంతో థియేటర్లు నిండిపోతున్నాయి. 

కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రను పోషించాడు. ప్రస్తుతం వీరు ముగ్గురి రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆనంద్ దేవరకొండకు రూ. 80 లక్షలు, వైష్ణవికి రూ. 30 లక్షలు, విరాజ్ అశ్విన్ కు రూ. 20 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News