Prathipati Pulla Rao: చేసింది చెప్పుకోకుండా జగన్ నోటికొచ్చినట్లు తిట్టడమేమిటి?: ప్రత్తిపాటి

Jagan should talk about his work in AP says Prathipati Pullarao
  • ఎన్నికలు ఇప్పుడు వచ్చినా జగన్ ఇంటికెళ్లడం ఖాయమన్న మాజీ మంత్రి
  • ప్రజాధనంతో ఏర్పాటు చేసిన సభలో వ్యక్తిగత విమర్శలేమిటని ప్రశ్న
  • జగన్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ఇక ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన శనివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఈ నాలుగేళ్ల కాలంలో ఏం చేశాడో చెప్పకుండా నోటికి వచ్చినట్లు తిట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన సభలో వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, నిరాశ, నిస్పృహలు ఆవహించాయన్నారు.

ఓటమి భయంతో నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విషబీజాలు నాటాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై ప్రత్తిపాటి స్పందించారు.
Prathipati Pulla Rao
YS Jagan
YSRCP
Telugudesam

More Telugu News