eluru: నక్సలైట్ల పేరుతో వ్యాపారికి ఫోన్లు.. రూ.2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపులు

three arrested for making threats in eluru
  • ఏలూరు జిల్లా కైకలూరులో నక్సల్స్ అవతారమెత్తిన దుండగులు
  • ముగ్గురు నిందితుల అరెస్టు, పరారీలో మరొకరు
  • గతంలో వ్యాపారి వద్ద డ్రైవర్‌‌గా పని చేసిన ఇద్దరు నిందితులు
ఏలూరు జిల్లా కైకలూరులో కొందరు దుండగులు నక్సల్స్ అవతారం ఎత్తారు. రూ.2 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. కలకలం రేపిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కైకలూరు వ్యాపారి ప్రసాద్‌రాజుకు నిందితులు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. తాము నక్సలైట్లమని చెప్పి.. రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులపై బాధితుడు ప్రసాద్‌రాజు మూడు రోజుల కిందట పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో ప్రసాద్ రాజు ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులు తోకల ఏసేబు, శీలం హేమంత్‌కుమార్‌, చిన్నం పెద్దబాబును కైకలూరు పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు మాణిక్‌రావు పరారీలో ఉన్నాడు. మాణిక్‌రావు, ఏసేబు గతంలో ప్రసాద్‌రాజు వద్ద డ్రైవర్లుగా పని చేశారు.
eluru
naxalite
threat to businessman
Fake naxalites

More Telugu News