hindu: మసీదు ముందు వరదలో కొట్టుకెళ్తున్న ఆవును ముస్లిం యువకుడితో కలిసి కాపాడిన కుర్రాళ్లు.. వీడియో వైరల్​!

Muslim youth helps to  save drowning cow in front of the mosque
  • వరదలో చిక్కుకున్న గోమాత
  • కాపాడే యత్నంలో ఇద్దరు కుర్రాళ్లకు సాయం చేసిన ముస్లిం యువకుడు

ఎవరెన్ని చెప్పినా మతసామరస్యానికి ప్రతీక మనదేశం. హిందూముస్లింల మధ్య ఐక్యత ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ తాజాగా అలాంటి సందర్భం మరోసారి కళ్లకు కట్టింది. మసీదు ముందు వరద నీటిలో చిక్కుకున్న ఆవు ఒడ్డుకు చేరేందుకు ఇబ్బంది పడటం చూసిన ఇద్దరు కుర్రాళ్లు దానికి సాయం చేశాడు. ఆవు కొమ్ములు పట్టుకొని పైకి లాగేందుకు ప్రయత్నించారు. కానీ, నీటి వేగానికి దాన్ని పైకి లాగలేకపోయారు. 

ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు వారికి సాయం చేశారు. అందులో ఓ ముస్లిం యువకుడు కూడా ఉన్నాడు. తలకు నమాజ్ టోపీ పెట్టుకొని వచ్చిన అతను వారికి సాయం చేయడంతో ఆవు నీటి నుంచి బయటకు వచ్చింది. దీన్ని అవతలి వైపు ఉన్న వ్యక్తులు వీడియో తీశారు. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. ‘ఈ వీడియో ఒకటి కంటే ఎక్కువ కారణాల వల్ల మనసుకు హాయిని కలిగించింది’ అని ట్వీట్ చేశారు. ఇండియా.. ఐకమత్యం అని హ్యాష్ ట్యాగ్స్ జోడించారు. ఒక్క రోజులోనే ఈ వీడియోకు 1.85 లక్షల వ్యూస్ వచ్చాయి.
hindu
muslim
cow
mosque
saves

More Telugu News