Nara Lokesh: జగనాసుర రక్త చరిత్ర అని చెల్లి షర్మిల తేల్చేసింది: లోకేశ్ ట్వీట్

Nara Lokesh tweet about YS Vivekananda murder
  • షర్మిల ఇచ్చిన వాంగ్మూలంపై టీడీపీ నేత ట్వీట్
  • అబ్బాయే బాబాయ్‌ని చంపేశాడని వెల్లడించారని ఆరోపణ
  • రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారన్న లోకేశ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇచ్చిన వాంగ్మూలంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. 'అది జగనాసుర రక్త చరిత్ర అని చెల్లి షర్మిల తేల్చేసింది' అని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ఫొటోతో ట్వీట్ చేశారు.

మా బాబాయ్ ని చంపింది మా అన్నే కావొచ్చు అని వైఎస్ షర్మిల వాంగ్మూలంలో చెప్పి ఉంటారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో హత్య జరిగిందని, హత్యకు పెద్ద కారణముందని వాంగ్మూలంలో షర్మిల వ్యాఖ్యానించిన మాటలను లోకేశ్ పేర్కొన్నారు. అవినాశ్ కుటుంబానికి వివేకానందరెడ్డి వ్యతిరేకంగా నిలబడటమే కారణంగా షర్మిల పేర్కొన్నారని తెలిపారు. కుటుంబంలో అంతా బాగున్నట్లు కనిపించినా లోపల కోల్డ్ వార్ ఉందని పేర్కొన్నారు.
Nara Lokesh
YS Jagan
YS Sharmila

More Telugu News