లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్
- ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు
- లోక్ సభ సెక్రటరీ జనరల్ కు వాయిదా తీర్మానం ఇచ్చిన నామా నాగేశ్వరరావు
- మణిపూర్ హింసాకాండపై మోదీ ప్రకటన చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
మరోవైపు మణిపూర్ హింసపై ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందిస్తూ... మణిపూర్ హింస అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లో బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తుతారని చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించాలని డిమాండ్ చేస్తారని అన్నారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.