మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఒకరి అరెస్ట్

One arrested in Manipur women naked parade case
  • దేశ వ్యాప్తంగా కలకలం రేపిన మహిళల నగ్న ఊరేగింపు వీడియో
  • వీడియో ఆధారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదన్న మోదీ
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ అంశంపై స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన వారిలో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరాదాస్ (32)ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీడియోలో గ్రీన్ కలర్ టీషర్ట్ ధరించి హీరాదాస్ కనిపిస్తున్నాడు. వీడియో ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Go Back to Shorts
Manipur
Women
** Parade
Arrest

More Telugu News