Raj kundra: శిల్పా శెట్టి భర్త హీరోగా కొత్త సినిమా

Raj Kundra to make acting debut with film on his jail term after porn scandal
  • పోర్న్ వీడియోల కేసులో గతంలో శిల్పా శెట్టి భర్త అరెస్ట్, బెయిల్ పై విడుదల 
  • ప్రస్తుతం మీడియాకు దూరంగా జీవితం గడుపుతున్న వైనం
  • రాజ్ కుంద్రా జైలు జీవితం ఆధారంగా మూవీ పట్టాలెక్కనుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ 
  • డైరెక్టర్ ఎవరనేదానిపై మేకర్స్ గోప్యత
  • సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్న రాజ్ కుంద్రా
పోర్న్ వీడియోల కేసులో అరెస్టయిన నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఆ తరువాత బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. విడుదల అనంతరం ఆయన మీడియా కంట్లో పడకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ, ముఖంపై మాస్కుతో ఉన్న ఆయన ఫొటోలు అప్పడప్పుడూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు సంబంధించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజ్ హీరోగా ఓ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందట. భార్య బాటలోనే రాజ్ కూడా నటుడిగా తన కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరో విశేషం ఏంటంటే.. తన జైలు అనుభవాలు ఆధారంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. దీంతో, రాజ్‌ కుంద్రా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. తన జైలు జీవితం గురించి ఆయన తెరపై ఏం షేర్ చేసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పోర్న్ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన 2021లో అరెస్టయ్యారు. పోలీసులు ఆయనను ఆర్థర్ రోడ్ జైల్లో కొంతకాలం ఉంచారు. ఇక, ఈ సినిమాకు అన్నీ తానై రాజ్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మూవీకి డైరెక్టర్ ఎవరనేదానిపై మాత్రం సినీబృందం గోప్యత పాటిస్తోందని తెలిసింది.
Raj kundra
Shilpa Shetty
Bollywood
Tollywood

More Telugu News