Ambati Rambabu: సత్తెనపల్లిలో అంబటికి వ్యతిరేకంగా సర్పంచ్ ల సమావేశం

YSRCP sarpanch meet against Minister Ambati
  • వైసీపీ నేత విజయభాస్కర రెడ్డి నివాసంలో ప్రజాప్రతినిధుల సమావేశం
  • గ్రామాల్లో అంబటి అనుచరుల పెత్తనంపై సర్పంచుల ఆగ్రహం
  • మరో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన
మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు సర్పంచ్ లు రహస్యంగా సమావేశమైనట్లుగా వార్తలు వచ్చాయి. స్థానిక వైసీపీ నాయకుడు విజయభాస్కర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అంబటి అనుచరుల పెత్తనంపై సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబటికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు సమావేశమైన అసమ్మతి నేతలు ఈ రోజు మరోసారి భేటీ అయ్యారు. ఇందులో పదకొండు మంది సర్పంచ్ లు, ఇద్దరు ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామాల్లో మంత్రి అనుచరులు పెత్తనం చేస్తున్నారని, తాము స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ తమను విస్మరించి కార్యక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదైనా సమస్యపై మంత్రి అంబటిని కలవాలన్నా కుదరడం లేదన్నారు. రెండ్రోజుల్లో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
Ambati Rambabu
YSRCP

More Telugu News