inorbit mall: విశాఖలో ఇనార్బిట్ మాల్.. శంకుస్థాపనకు జగన్‌కు ఆహ్వానం

K Raheja group invites CM Jagan for Inorbit mall foundation
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన నీల్ రహేజా
  • శాలువా కప్పి, శ్రీవారి చిత్రాన్ని బహూకరించిన ముఖ్యమంత్రి
  • రానున్న మూడేళ్లలో రూ.600 కోట్ల పెట్టుబడి
విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కే రహేజా గ్రూప్ ప్రతినిధులు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కే రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనకు సీఎం శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి, తిరుమల శ్రీవారి చిత్రాన్ని బహూకరించారు. నీల్ రహేజాతో పాటు ఇనార్బిట్ మాల్స్ సీఈవో రజనీశ్ మహాజన్, కే రహేజా గ్రూప్ తెలుగు రాష్ట్రాల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రవణ్ హాజరయ్యారు. కే రహేజా గ్రూప్ ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనుంది. ఇందుకు రానున్న మూడేళ్లలో ఆరువందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.
inorbit mall
Visakhapatnam
YS Jagan

More Telugu News