లారెన్స్ - నయనతార జోడీగా హారర్ థ్రిల్లర్ .. రంగం సిద్ధమైనట్టే!

Nayan in Lawrence Movie
  • లారెన్స్ కి బాగా అనుభవమున్న హారర్ థ్రిల్లర్ జోనర్ 
  • ఆల్రెడీ అదే జోనర్లో మెప్పించిన నయనతార 
  • ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు 
  • లోకేశ్ కనగరాజ్ అందించిన కథ - స్క్రీన్ ప్లే
నాయిక ప్రధానమైన సినిమాల్లో నయనతారకి తిరుగు లేకుండా చేసిన సినిమాలు హారర్ థ్రిల్లర్లే అని చెప్పాలి. 'మాయా' (మయూరి) వంటి సినిమాలు ఇతర భాషల్లో సైతం నయనతారకి భారీ విజయాన్ని కట్టబెట్టాయి. ఇక లారెన్స్ ను హీరోగా నిలబెట్టిన సినిమాలు కూడా హారర్ నేపథ్యంలో వచ్చినవే అని చెప్పాలి. ఆ జాబితాలో 'కాంచన' .. 'గంగ' .. 'శివలింగ' వంటి సినిమాలు కనిపిస్తాయి. 

ఇక రీసెంట్ గా లారెన్స్ చేసింది కూడా 'చంద్రముఖి' సీక్వెల్ నే. అలాంటి లారెన్స్ హీరోగా దర్శకుడు రత్నకుమార్ ఒక హారర్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. క్రితం ఏడాది నుంచి ఈ కాంబినేషన్ మాట వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ కథ .. స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగుకి సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. హారర్ సినిమాలు చేయడంలో మంచి అనుభవం ఉన్న లారెన్స్ - నయనతార ఇద్దరూ కూడా ఏ రేంజ్ లో మెప్పిస్తారనేది చూడాలి మరి.

Advertisement
Lawerence
Nayanatara
Rathna Kumar

More Telugu News