Vijay Antony: ఈ వారం థియేటర్స్ కి వస్తున్న సినిమాలివే!

  • ఈ నెల 20న రిలీజ్ అవుతున్న 'హిడింబ'
  • 21న విడుదలవుతున్న మూడు సినిమాలు 
  • 'హత్య' మూవీపై పెరుగుతున్న అంచనాలు
  • 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'పై ఆసక్తి  
Movies releasing in this week

ఈ వారం ఓ అరడజను చిన్న సినిమాల వరకూ థియేటర్స్ లో రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాగా 'హత్య' కనిపిస్తోంది. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా రితిక సింగ్ - మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకుల ముందుకు సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసుకొస్తున్నారు. ఇక ఆ తరువాత స్థానంలో 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' కనిపిస్తోంది. చైతన్యరావు - లావణ్య జంటగా నటించిన ఈ సినిమాకి, చందు ముద్దు దర్శకత్వం వహించాడు. బిగ్ బెన్ సినిమా వారు నిర్మించిన ఈ సినిమా, జంధ్యాల మార్కు సినిమాగా .. ఆ కాలం నాటి నేపథ్యంలో రానుందని తెలుస్తోంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక 'హర్' .. 'జిలేబి' వంటి సినిమాలు ఈ రోజునే థియేటర్స్ లో దిగిపోనున్నాయి. ఈ సినిమాల కంటే ఒక రోజు ముందుగా, అంటే .. ఈ నెల 20వ తేదీన 'హిడింబ' ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా నందిత శ్వేత అలరించనుంది. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమాల్లో ఏది ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి. 

More Telugu News