Anand Devarakonda: 'బేబి' 3 రోజుల వసూళ్లు!

  • వైష్ణవీ చైతన్య ప్రధాన పాత్రగా 'బేబి'
  • ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే కథ 
  • ఈ నెల 14న థియేటర్స్ కి వచ్చిన సినిమా 
  • 3 రోజుల్లో 23.5 కోట్ల వసూళ్లు
Baby Movie Update

ఆనంద్ దేవరకొండ .. వైష్ణవీ చైతన్య .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'బేబి', ఈ నెల 14వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ సినిమాకి, సాయి రాజేశ్ నీలం దర్శకత్వం వహించాడు. టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకూ నడిచిన ఒక ప్రేమకథ ఇది. 

విడుదలైన రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక వీకెండ్ లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 23.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఆనంద్ దేవరకొండ కెరియర్ లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమాగా దీనిని గురించి చెప్పుకుంటున్నారు. 

ఆనంద్ దేవరకొండకి ఒక మాదిరి ఇమేజ్ ఉంది .. నటుడిగా విరాజ్ కొంతమందికి తెలుసు. కానీ యూట్యూబ్ స్టార్ గా వైష్ణవి చైతన్యకి మంచి క్రేజ్ ఉంది. యూత్ లో ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాపై ఈ స్థాయిలో క్రేజ్ పెరగడానికి ఇదో కారణంగా చెబుతున్నారు. వీకెండ్ ను దాటిన ఈ సినిమా, ఎంతవరకూ నిలబడుతుందనేది చూడాలి. 

More Telugu News