బెంగళూరులో ఈరోజు జరగనున్న విపక్షాల సమావేశానికి శరద్ పవార్ దూరం.. కారణం ఇదే!
- బెంగళూరులో ఈరోజు, రేపు సమావేశమవుతున్న విపక్షాలు
- రేపు తన కుమార్తెతో కలిసి సమావేశాలకు హాజరు కానున్న పవార్
- ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటమే కారణం
మరోవైపు విపక్షాల కూటమిలో కీలక నేత అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈనాటి సమావేశానికి హాజరుకావడం లేదు. తన కూతురు, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలేతో కలిసి రేపు ఆయన సమావేశంలో పాల్గొంటారు. ఈ విషయాన్ని ఎన్సీపీ అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే శరద్ పవార్ ఈరోజు జరిగే విపక్ష సమావేశానికి హాజరుకావడం లేదు.