Punjab: వింత చోరీ.. ఏటీఎంలో డబ్బులకు బదులు ఏసీని ఎత్తుకెళ్లిన దొంగలు

thieves steal ac from sbi atm center in moga district of punjab
  • పంజాబ్‌లోని మోగా జిల్లా బాఘ్ పట్టణంలో వెలుగు చూసిన ఘటన
  • బైక్‌పై వచ్చి ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులు
  • ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఘటన
  • బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు  
ఏటీఎంలో దొంగలు పడ్డారని తెలిస్తే డబ్బులు దోచుకుని పోయి ఉంటారని అనుకుంటాం. కానీ, పంజాబ్‌లో మాత్రం ఇద్దరు దొంగలు ఏటీఎం సెంటర్‌లోని ఏసీని ఎత్తుకెళ్లిపోయారు. మోగా జిల్లాలోని బాఘ్ పట్టణం ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం ఈ చోరీ జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.  

ఆదివారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించారు. ఒకరు డస్టబిన్‌ను తిరగేసి దానిపై ఎక్కి ఏసీ వైర్లను కత్తిరించారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఏసీని కిందకు దించి తమతో పాటూ తీసుకెళ్లిపోయారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీ దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Punjab
ATM Theft

More Telugu News