Panchakarla Ramesh Babu: ఈనెల 20న జనసేనలోకి పంచకర్ల రమేశ్ బాబు

panchakarla ramesh babu met janasena chief pawan kalyan
  • పవన్‌ కల్యాణ్ తనను పార్టీలోకి స్వాగతించారన్న పంచకర్ల రమేశ్ బాబు
  • సామాన్య కార్యకర్తలా పని చేస్తానని వెల్లడి
  • ఆత్మ గౌరవం దెబ్బతినటం వల్లే వైసీపీని వీడానని వ్యాఖ్య

పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఈ నెల 20న జనసేన పార్టీలో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ప్రకటించారు. పవన్‌ తనను పార్టీలోకి స్వాగతించారని చెప్పారు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన ఆయన.. పవన్‌తో భేటీ అయ్యారు.

తర్వాత మాట్లాడుతూ.. ‘‘మూడు రోజుల కిందట వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశా. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి పార్టీలో పని చేయాలనుకుంటున్నా. ఈ నెల 20న సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడే పార్టీలో చేరతానని.. సామాన్య కార్యకర్తలా పని చేస్తా” అని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సుకు ఒక సైనికుడిలా పని చేస్తానని పంచకర్ల రమేశ్ బాబు పేర్కొన్నారు. తన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ చెప్పారన్నారు.

ఆత్మ గౌరవం దెబ్బతినటం వల్లే వైసీపీని వీడినట్లు రమేశ్ బాబు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించానని నిరూపిస్తే గొంతు కోసుకుంటానన్నారు. వైవీ సుబ్బారెడ్డి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు.

  • Loading...

More Telugu News