Panchakarla Ramesh Babu: పవన్ కల్యాణ్‌తో పంచకర్ల రమేశ్ బాబు భేటీ

panchakarla ramesh babu meets jana sena chief pawan kalyan in mangalagiri
  • వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్ బాబు
  • మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌తో రమేశ్‌ బాబు భేటీ
  • రెండు మూడు రోజుల్లో పార్టీలో చేరే అవకాశం
వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ను రమేశ్‌ బాబు కలిశారు.

ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌తో రమేశ్‌ బాబు భేటీ అయ్యారు. జనసేనలో చేరడం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రమేశ్‌బాబు పోటీ చేసే అవకాశం ఉంది.
Panchakarla Ramesh Babu
Pawan Kalyan
Janasena
Mangalagiri
YSRCP
pendurthi
Vizag

More Telugu News