Jogi Ramesh: పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే వాలంటీర్ చేతిలో ఓడిస్తాం: జోగి రమేశ్

Jogi Ramesh says YSRCP will defeat Pawan Kalyan
  • రాష్ట్రానికి ముగ్గురు సైకోలు తగిలారని జోగి ఆగ్రహం
  • వృద్ధ సైకో, పిల్ల సైకో, ఇంకో సైకో గంజాయి సైకో 
  • గంజాయి సాగును పెంచి పోషించిందే టీడీపీ ప్రభుత్వమని విమర్శ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగితే, ఆయనపై వాలంటీర్‌ను పోటీ పెట్టి ఓడిస్తామని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఆయనకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రానికి ముగ్గురు సైకోలు తగిలారని ధ్వజమెత్తారు. వృద్ధ సైకో, పిల్ల సైకో, ఇంకో సైకో గంజాయి తాగి రోడ్డునపడ్డ సైకో అన్నారు. ఏపీకి పట్టిన సైతాన్ చంద్రబాబు, భూతం లోకేశ్, పిశాచం పవన్ కల్యాణ్ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చర్చకు రమ్మంటే పారిపోయేవారన్నారు.

లోకేశ్ ఒక అప్పడంగాడని, ఈ అప్పడం గవర్నర్ ని కలిసి రాష్ట్రంలో గంజాయి ఉందని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అతనికి ఏం అర్హత ఉందని, వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం ఏమిటన్నారు. గంజాయి సాగును పెంచి పోషించిందే టీడీపీ అన్నారు. దీనిని ధ్వంసంచేసి జగన్ క్లీన్ ఏపీగా మార్చారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంజాయి అమ్మకాల్లో పోటీ పడ్డారన్నారు. ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కితే వారికి 23 సీట్లు కూడా రావన్నారు.

టీడీపీ హయాంలో మంత్రులు గంజాయి వ్యాపారం చేశారని ఆరోపించారు. నాటి ప్రభుత్వంలో గంజాయి సరఫరాలో పెద్దపెద్దవారి జోక్యం ఉందని మంత్రులే చెప్పారన్నారు. చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు చెప్పారన్నారు. అలాంటి ప్రభుత్వంపై లోకేశ్ ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు.

అప్పుడు పవన్ ఐస్ క్రీమ్ తింటున్నారా?


వాలంటీర్ల గురించి ప్రశ్నిస్తున్న పవన్ టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేసినప్పుడు పవన్ ఐస్ క్రీమ్ తింటున్నారా? అని మరో మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. ఆయనకు ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉందని, అతనొక రాజకీయ వ్యభిచారి అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై పవన్ కు విశ్వాసం లేదన్నారు. పవన్ కూడా పీకే గాడు.. వీపీ గాడు అని తాము ఏకవచనంతో అనలేమా? అని అగ్రహించారు.
Jogi Ramesh
YSRCP
Janasena
Pawan Kalyan

More Telugu News