Rahul Gandhi: రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi moves SC against Gujarat HC refusing to stay his conviction
  • మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు
  • సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించిన గుజరాత్ హైకోర్టు
  • దీంతో సుప్రీం గడప తొక్కిన కాంగ్రెస్ అగ్రనేత
పరువు నష్టం దావా కేసులో తనకు పడిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2019 ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ తీర్పుపై రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు తీర్పును సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఈ కేసులో రాహుల్ గాంధీకి శిక్ష సరైనదేనని, న్యాయపరమైనదేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ శిక్షను నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, ఈ క్రమంలో పిటిషనర్ అభ్యర్థనను కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు కావడంతో రాహుల్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
BJP

More Telugu News