Kasturi: సినీ నటి కస్తూరిపై వెల్లువెత్తుతున్న విమర్శలు

  • వైన్ షాపులో మద్యం కొంటున్న అమ్మాయిల వీడియో షేర్ చేసిన కస్తూరి
  • అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు షేర్ చేశావంటూ నెటిజన్ల ఫైర్
  • మందు కొట్టాలని అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నారా? అంటూ కొందరి ప్రశ్న
Actress Kasturi in new controversy

ప్రముఖ సినీ నటి కస్తూరి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని విమర్శలపాలు అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడులోని ఓ వైన్ షాప్ వద్ద ఇద్దరు అమ్మాయిలు మద్యం కొంటున్న వీడియోను ఆమె పోస్ట్ చేసింది. దీనికి... 'అమ్మాయిలూ బాగా తాగండి ' అని కామెంట్ కూడా చేసింది.

 దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయిల వ్యక్తిగత జీవితానికి చెందిన విషయాన్ని ఎందుకు షేర్ చేశారని మండిపడుతున్నారు. చాలా మందిని తప్పుదోవ పట్టించేలా మీ పోస్ట్ ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. అమ్మాయిలు మందు కొట్టాలని మీరు ప్రోత్సహిస్తున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 


కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. నయనతార సరోగసీ, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ పాత్ర, ఏఆర్ రెహమాన్ భార్యకు తమిళం సరిగా రాదు అని... ఇలా పలు విషయాలపై మాట్లాడి ఆమె విమర్శలపాలు అయింది.

More Telugu News