Tamannaah: తమన్నాని పిచ్చిగా లవ్ చేస్తున్నా: నటుడు విజయ్ వర్మ

Actor vijay varma says he is madly in love with tamannaah Bhatia
  • తమన్నాతో రిలేషన్‌షిప్‌పై స్పందించిన విజయ్ వర్మ
  • తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని తనకిప్పుడు బాగా అర్థమైందని వెల్లడి   
  • తమన్నా రాకతో విలన్ దశ ముగిసి, రొమాంటిక్ దశ మొదలైందని వ్యాఖ్య
మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త కొంత కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ విడుదల నేపథ్యంలో వీరి ఆఫ్ స్క్రీన్ లవ్ ట్రాక్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. తమ రిలేషన్‌పై వీరిద్దరూ చాలా కాలం మౌనంగా ఉంటూ ఉత్కంఠను కొనసాగించడంలో సక్సెస్ అయ్యారు. అయితే, విజయ్ వర్మ తమ్మన్నాపై తన ఫీలింగ్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో బయటపడ్డాడు.   

‘‘మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని నాకిప్పుడు బాగా అర్థమైంది. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె నా లైఫ్‌లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయింది. రొమాంటిక్ దశ మొదలైంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ దగ్గరయ్యారనేది ఒక టాక్. 

విజయ్‌తో రిలేషన్‌షిప్‌పై తమన్నా కూడా ఓమారు స్పందించింది. ‘‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది. నేను ఇప్పటివరకూ ఎంతో మంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే విజయ్ నాకు ఎంతో స్పెషల్. అతడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని, కష్ట సమయంలో నాతోనే ఉంటాడన్న నమ్మకం ఉంది’’ అని ఆమె చెప్పారు.
Tamannaah
Vijay Varma
Bollywood

More Telugu News