Anasuya Bharadwaj: మళ్లీ ఏమైంది మేడం?.. అనసూయ ట్వీట్‌తో నెట్టింట కలకలం!

Actor anchor anasuya tweet creates quite a flutter on social media
  • తన పేరు ప్రస్తావించకుండా ఏదీ చెప్పలేకపోతున్నారంటూ అనసూయ ట్వీట్
  • ఎవరిని ఉద్దేశించి ఆమె ఈ కామెంట్ చేసిందో అర్థంకాక నెటిజన్ల గగ్గోలు
  • మిమ్మల్ని ఎవరేమన్నారు? అంటూ అభిమానుల ప్రశ్నల పరంపర
  • నెట్టింట హాట్‌టాపిక్‌గా మారిన అనసూయ ట్వీట్

మనసులో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్పేసే సెలబ్రిటీల్లో ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కూడా ఒకరు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆమె చేసే ప్రతి ట్వీట్ ఒక సంచలనమే! ప్రస్తుతం అనసూయ చేసిన మరో కామెంట్ నెట్టింట గగ్గోలు రేపుతోంది. ‘‘మళ్లీ ఏమైంది మేడం? మిమ్మల్ని ఎవరేమన్నారు?’’ అంటూ అభిమానులు కంగారు పడిపోతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

ఇంతకీ అనసూయ ఏమన్నారంటే.. ‘‘వావ్.. నేను నిజంగా చాలా ఇంపార్టెంట్ వ్యక్తినే. నా ప్రమేయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగదంటే.. నాపై అంతగా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు ప్రస్తావించకుండా ఏదీ చెప్పలేకపోతున్నారు’’ అని అనసూయ ఓ ట్వీట్ వదిలారు. దీంతో, ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసిందో అర్థంకాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. అనసూయ గతంలో చేసిన పలు ట్వీట్లు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News