Panchakarla Ramesh Babu: జనసేనలో చేరుతున్న పంచకర్ల రమేశ్ బాబు?

Panchakarla Ramesh Babu to join Janasena
  • వైసీపీకి గుడ్ బై చెప్పిన పంచకర్ల రమేశ్ బాబు
  • ఈ నెల 17న పవన్ కల్యాణ్ ను కలుస్తున్నట్టు సమాచారం
  • అభిమానులు, మద్దతుదారులతో చర్చలు జరుపుతున్న పంచకర్ల

వైసీపీకి రాజీనామా చేసిన విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన అభిమానులు, మద్దతుదారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 17న జనసేనాని పవన్ కల్యాణ్ ను కలుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పంచకర్ల రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం టికెట్ పై పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమయింది. 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ తో పాటు పంచకర్ల టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కన్నబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. విశాఖ రాజధానిని టీడీపీ వ్యతిరేకించడంతో 2020 మార్చిలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు. 

  • Loading...

More Telugu News