Chegondi Harirama Jogaiah: అందులో వాలంటీర్లు లేకుండా చూడండి: జనసైనికులకు హరిరామజోగయ్య లేఖ

  • ఈ నెల 21 నుండి ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు
  • ఈసీ మెమో ప్రకారం ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనరాదన్న జోగయ్య  
  • వాలంటీర్లు పాల్గొంటే ప్రతిపక్ష అనుకూల ఓటర్లను తొలగించే ప్రమాదముందని వ్యాఖ్య 
  • వాలంటీర్లు ఈ ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని సూచన
Harirama Jogaiah open letter to Janasainiks

జనసైనికులకు పిలుపు అంటూ మాజీ మంత్రి చోగొండి హరిరామజోగయ్య మరో లేఖను విడుదల చేశారు. ఎన్నికల అధికారి ఇచ్చిన మెమో ప్రకారం వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించకూడదన్నారు. రావణ రాజ్యం పోవాలన్నా.. రామరాజ్యం రావాలన్నా.. జగన్ పోవాలి.. పవన్ రావాలి.. ఇదే మన నినాదమని సూచించారు. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఓట్ల జాబితా నుండి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ నెల 21న నుండి అర్హులైన కొత్త ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవడం, అనర్హులైన ఓటర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా జన సైనికులు అందరూ పర్యవేక్షించాలన్నారు. ఇందులో వాలంటీర్లు పాల్గొంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న అనర్హులైన ఓటర్లను ఓట్ల జాబితాలో చేర్చవచ్చునని, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రమాదం ఉందన్నారు. దీని నుండి తప్పించుకోవడానికి వాలంటీర్లు ఈ ప్రక్రియలో పాల్గొనకుండా జనసైనికులు చూడాలన్నారు.

More Telugu News