పంచకర్ల రమేశ్ బాబు వైసీపీకి రాజీనామా చేయడం తొందరపాటు చర్య: వైవీ సుబ్బారెడ్డి
- విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల
- సీఎంను కలిసే అవకాశం తనకు రాలేదని పంచకర్ల చెప్పడం అబద్ధమన్న సుబ్బారెడ్డి
- వచ్చే వారం జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని వెల్లడి
సీఎంను కలవాలనే విషయం తనతో చెపితే తప్పకుండా ఆ విషయంలపై చర్చించేవారమని అన్నారు. ఆయన రాజీనామా తొందరపాటు చర్య అని చెప్పారు. ఏదైనా తనతో చర్చిస్తే బాగుండేదని అన్నారు. రమేశ్ కు జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించామని తెలిపారు. వచ్చే వారం జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని వెల్లడించారు.