చంద్రయాన్-3 మిషన్ లో హైదరాబాదీ కంపెనీ
- కీలక పరికరాలను తయారుచేసిచ్చిన ప్రెసిసన్ ఇంజనీర్స్ లిమిటెడ్
- కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో కంపెనీని స్థాపించిన డీఎన్ రెడ్డి
- మరికాసేపట్లో నింగికెగరనున్న జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్
ప్రెసిసన్ కంపెనీని డీఎన్ రెడ్డి కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో ఏర్పాటు చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో కీలకమైన పరికరాలను తయారు చేస్తోంది. ఇస్రో గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్లోనూ ఈ కంపెనీ పాలుపంచుకుంది.
1998 నుంచి ఇస్రో ప్రయోగించిన 50 ఉపగ్రహాలలో పలు విడి భాగాలను తయారుచేసింది. తాజాగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను తయారుచేసిచ్చింది.