Titan submersible: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయిన యానిమేటెడ్ వీడియో వైరల్.. 13 రోజుల్లో 9.8 మిలియన్ల వ్యూస్!

Animated video of Titan sub disaster goes viral on YouTube
  • టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్
  • పాక్ బిలియనీర్, ఆయన కుమారుడు సహా ఐదుగురి మృతి
  • యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియో

టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందిన యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్‌కు చేరువవుతోంది. టైటాన్ విషాదంలో పాకిస్థాన్ బిలియనీర్, ఆయన కుమారుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనకు సంబంధించి యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో దర్శనమిచ్చింది. జూన్ 30న ‘అయిటెల్లీ’ అనే చానల్‌లో దీనిని పోస్టు చేశారు. ఆ వెంటనే అది ట్రెండ్ అయింది. నేడు పదమూడో రోజు కాగా ఇప్పటికే 9.8 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ వీడియోలో టైటాన్ ఎలా పేలిపోయింది.. చుట్టుపక్కల పీడనం దానిపై ఎలాంటి ప్రభావం చూపించింది.. పేలిపోయిన తర్వాత దాని శకలాలు ఎలా ఎగిరిపడ్డాయి? వంటివి కళ్లకు కట్టినట్టు చూపించారు. 

ప్రతి చదరపు అంగుళానికి దాదాపు 5600 పౌండ్ల ఒత్తిడితో ఉపరితలంపై మనం అనుభవించే దానికంటే దాదాపు 400 రెట్లు ఎక్కువ పీడనాన్ని అది ఎలా ఎదుర్కొందీ అన్న విషయాలను చక్కగా వివరిస్తూ చూపించడంతోనే ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దీనికి తోడు అన్నీ వివరంగా చూపించడం కూడా ఆకర్షించింది. 

  • Loading...

More Telugu News