PM Modi: మోదీ పర్యటన ఎఫెక్ట్.. భారత విద్యార్థులకు ఫ్రాన్స్ లో ఐదేళ్ల వర్క్ వీసా

5 Year Work Visa For Indian Students Pursuing Masters In France says PM Modi
  • గతంలో రెండేళ్లు మాత్రమే ఉండేదన్న ప్రధాని మోదీ
  • పారిస్ లో భారత సంతతి ప్రజలతో భేటీలో మోదీ వెల్లడి
  • ఎయిర్ పోర్ట్ లో మోదీకి స్వాగతం పలికిన ఫ్రాన్స్ ప్రధాని
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత విద్యార్థులకు ప్రాన్స్ శుభవార్త చెప్పింది. మాస్టర్స్ వంటి ఉన్నత చదువుల కోసం పారిస్ వచ్చే భారత విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక ఐదేళ్ల పాటు పనిచేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఐదేళ్ల వర్క్ వీసా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వెల్లడించారు. ఇప్పటి వరకు రెండేళ్ల వర్క్ వీసా మాత్రమే ఉందని చెప్పారు.

గురువారం పారిస్ చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ ప్రధాని ఎలిజబెత్ బార్నే ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పారిస్ లోని లా సినె మ్యుజికాలె ఆడిటోరియంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. గతంలో తాను ఫ్రాన్స్ లో పర్యటించినపుడు భారత విద్యార్థులకు రెండేళ్ల వర్క్ వీసా మాత్రమే ఇచ్చేదని, ఇప్పటి వరకూ అదే విధానం కొనసాగుతోందని చెప్పారు. తాజాగా ఈ వీసా పర్మిట్ ను ఫ్రాన్స్ ఐదేళ్లకు పొడిగించిందని మోదీ చెప్పారు. చదువు పూర్తయ్యాక ఇక్కడే ఐదేళ్ల పాటు పనిచేసుకునే వెసులుబాటు భారత విద్యార్థులకు కలుగుతుందని వివరించారు.
PM Modi
France
Tour
Indian Students
work visa
5 years visa
paris

More Telugu News