BS Rao: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూత

  • తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థలు
  • తీవ్ర గుండెపోటుకు గురైన బీఎస్ రావు
  • హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన వైనం
  • భౌతికకాయం విజయవాడకు తరలింపు
BS Rao of Sri Chaitanya educationals institutions dies due to heart attack

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. ఆయన హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, బీఎస్ రావు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఆయన భౌతికకాయాన్ని ఈ సాయంత్రం విజయవాడకు తరలించనున్నారు. బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు.

డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు. 

మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు. 

డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.

More Telugu News