వరదలకు వందమందికిపైగా బలి.. హిమాచల్‌ప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు
- దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
- ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 80 మంది మృత్యువాత
- విరిగిపడుతున్న కొండచరియలు
- ఉత్తరాఖండ్‌లో 9 మంది యాత్రికుల మృతి
- హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 1,050 కోట్ల నష్టం
ఉత్తరాఖండ్‌లో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా కొండచరియలు విరిగిపడి మరో 13 మంది గాయపడ్డారు. ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తోంది. యమునా సాగర్‌లోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి యమునా నదిలోకి హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుండడంతో పాత యమునా బ్రిడ్జిని మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.1,050 కోట్ల నష్టం సంభవించింది. 333 ఇళ్లు దెబ్బతిన్నాయి. 41 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.