Jagan: దర్శి బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్

CM Jagan responds on bus accident near Darshi
  • సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు
  • ఏడుగురి మృతి
  • 12 మందికి గాయాలు
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన సీఎం జగన్ 

ప్రకాశం జిల్లాలో ఓ పెళ్లి బృందం బస్సు సాగర్ కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు మరణించడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని ఆదేశించారు. 

గతరాత్రి పొదిలి నుంచి పెళ్లి వారితో కాకినాడ వెళుతున్న ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్సు దర్శి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి, పక్కనే ఉన్న సాగర్ కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News