తిరుమలలో నేడు కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ
- స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
- నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
- వెలుపలికి వచ్చిన క్యూ లైన్లు
- నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.4.69 కోట్ల ఆదాయం
నిన్న ఆదివారం తిరుమల వెంకన్నను 88,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,231 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే సమయంలో శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.69 కోట్ల ఆదాయం లభించింది.