గండికోటలో ఒబెరాయ్ హోటల్ కు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్
- వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటన
- విశాఖ, తిరుపతిలో ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన
- జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కడప జిల్లా గండికోటతో పాటు విశాఖపట్నం, తిరుపతిలో ఒబెరాయ్ సంస్థ సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మిస్తోంది. ఈ హోటళ్ల నిర్మాణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం గండికోటలో వ్యూ పాయింట్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు.
అక్కడి నుంచి గరండాల రివర్ ఫ్రంట్ చేరుకుని గరండాల కెనాల్ డెవలప్ మెంట్ ఫేజ్-1 పనులను ప్రారంభిస్తారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఆపై పులివెందులలో న్యూటెక్ బయోసైన్స్ ను, మధ్యాహ్నం 2:30 గంటలకు వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.