Vidadala Rajini: ఈసారి చంద్రబాబుకు సవాల్ విసిరిన మంత్రి విడదల రజని

Vidadala Rajini challenges TDP Chief Chandrababu
  • గతవారం లోకేశ్ కు సవాల్ విసిరిన రజని
  • దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చర్చకు రావాలని సవాల్
  • నేడు గుడివాడలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి-2 ప్రారంభించిన రజని
  • ఐదేళ్ల పాలనలో ఏంచేశారో చెప్పాలంటూ చంద్రబాబుకు సవాల్

ఆరోగ్యశ్రీపై చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ నారా లోకేశ్ కు గత వారం సవాల్ విసిరిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా గుడివాడలో 100 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రి-2ని మంత్రి విడదల రజని ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబుకు దమ్ముంటే తన ఐదేళ్ల పాలనలో ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. ఆరోగ్యశ్రీ పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. 

చంద్రబాబు ప్రజల్లో నమ్మకం కోల్పోయారని, ఇప్పుడాయన మేనిఫెస్టో అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు మాటలకే పరిమితం అని ఎద్దేవా చేశారు. కాగా, ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా పాల్గొన్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించే సత్తా టీడీపీకి లేదని మంత్రి రజని అన్నారు.

  • Loading...

More Telugu News